ట్రాన్సపోసిషన్ (జన్యుమార్పిడి) గురించి వివరణ తెలుగులో

ట్రాన్స్‌పోజిషన్ అంటే డీఎన్ఏ భాగాన్ని జన్యువులోని ఒక ప్రదేశం నుండి తొలగించి మరొక ప్రదేశంలోకి చొప్పించే ప్రక్రియ.

07 ఏప్రిల్, 2025
ట్రాన్సపోసిషన్ (జన్యుమార్పిడి) గురించి వివరణ | Transposition
ట్రాన్సపోసిషన్ (జన్యుమార్పిడి)

జన్యుమార్పిడి ప్రాథమికాలు

ట్రాన్స్‌పోజిషన్ అంటే ట్రాన్స్‌పోజబుల్ ఎలిమెంట్ (TE) లేదా ట్రాన్స్‌పోసన్ అని పిలువబడే DNA యొక్క నిర్దిష్ట భాగాన్ని జన్యువులోని ఒక ప్రదేశం నుండి తొలగించి మరొక ప్రదేశంలోకి చొప్పించే ప్రక్రియ.

దీనిని “జంపింగ్ జీన్” (jumping gene; జన్యువు దూకడం లేదా జన్యుమార్పిడి) అని కూడా పిలుస్తారు. ఈ చర్య ఒకే క్రోమోజోమ్‌లో లేదా వేరే వేరే క్రోమోజోమూల మధ్య కూడా సంభవించవచ్చు.

జన్యుమార్పిడి జన్యు పరిమాణంలో మార్పులు, జన్యు అంతరాయం, జన్యు నకిలీ మరియు కొత్త నియంత్రణ మూలకాల సృష్టికి దారితీస్తుంది. జన్యు పరిణామం మరియు వైవిధ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

జన్యుమార్పిడి ఎల్లప్పుడూ ప్రయోజనకరంగా ఉండదు. జన్యువులలో లేదా నియంత్రణ ప్రాంతాలలో ట్రాన్స్‌పోజన్‌లను చొప్పించడం వల్ల ఉత్పరివర్తనలు సంభవించవచ్చు, జన్యు పనితీరులో మార్పు వస్తుంది.

బయోటెక్నాలజీలో, జన్యు పంపిణీ మరియు ఉత్పరివర్తన అధ్యయనాలకు జన్యుమార్పిడి (ట్రాన్స్‌పోజిషన్) ఒక సాధనంగా ఉపయోగించబడుతుంది.

జన్యుమార్పిడి రకాలు

స్వయంప్రతిపత్తి లేదా అస్వయంప్రతిపత్తి

ట్రాన్స్‌పోజన్‌లు స్వయంప్రతిపత్తి కలిగి ఉండవచ్చు, అంటే అవి వాటి స్వంత మార్పిడికి అవసరమైన అన్ని ప్రోటీన్‌లను (ట్రాన్స్‌పోసేస్ వంటివి) ఎన్కోడ్ చేస్తాయి. స్వయంప్రతిపత్తి లేని ట్రాన్స్‌పోజన్‌లకు వాటి స్వంత కదలికకు జన్యువులు ఉండవు మరియు అవసరమైన ఎంజైమ్‌లను అందించడానికి జన్యువులో స్వయంప్రతిపత్తి ట్రాన్స్‌పోజన్ ఉనికిపై ఆధారపడతాయి.

రెప్లికేటివ్ లేదా నాన్-రెప్లికేటివ్

కొన్ని ట్రాన్స్‌పోజన్‌లు ప్రతిరూపణ (రెప్లికేటివ్) పద్ధతిను ఉపయోగిస్తాయి. ఇందులో ట్రాన్స్‌పోజన్ యొక్క కొత్త కాపీ లక్ష్య ప్రదేశంలో ఉత్పత్తి అవుతుంది, అసలుది అలాగే ఉంటుంది. వ్యతిరేక పద్ధతిలో (అంటే నాన్-రెప్లికేటివ్ ట్రాన్స్‌పోజిషన్‌లో) అసలు డిఎన్ఏ విభాగం యొక్క భౌతిక కదలిక ఉంటుంది.

జన్యుమార్పిడి తరగతులు

క్లాస్ I - రెట్రోట్రాన్స్‌పోజన్‌లు

ఇందులో జన్యుమార్పిడి ఆర్ఎన్ఏ (RNA) ద్వారా జరుగుతుంది. మొదలు, డిఎన్ఏ ఆర్ఎన్ఏ గ మారుతుంది. ఈ ఆర్ఎన్ఏ లక్ష్య ప్రదేశానికి చేరుకున్నాక మల్లి డిఎన్ఏ గా మారుతుంది. దీనికి రివర్స్ ట్రాన్స్క్రిప్టేసే అనే ఒక ఎంజైమ్ అవసరం. దీనిని రెట్రో-ట్రాన్స్‌పోజిషన్ అంటారు. యూకారియోట్‌లలో రెట్రోట్రాన్స్‌పోజన్‌లు సాధారణం.

క్లాస్ II - డిఎన్ఏ ట్రాన్స్‌పోజన్‌లు

ఇందులో జన్యుమార్పిడి నేరుగా డిఎన్ఏగా జరుగుతుంది. డిఎన్ఏ ను దాని అసలు స్థానం నుండి తొలగించి కొత్త ప్రదేశంలోకి ప్రవేశ చేయబడుతుంది. దీనిని తరచుగా “కట్ అండ్ పేస్ట్” పద్ధతి అని వర్ణిస్తారు, అయితే కొన్ని డిఎన్ఏ ట్రాన్స్‌పోజన్‌లు రెప్లికేటివ్ పద్దితి (పైన దీని గురించి రాసాను) కూడా ఉపయోగించవచ్చు. ట్రాన్స్‌పోసేస్ ఎంజైమ్‌ల ద్వారా కదలిక సులభతరం అవుతుంది. డిఎన్ఏ ట్రాన్స్‌పోజన్‌లు ప్రొకార్యోట్‌లు మరియు యూకారియోట్‌లు రెండింటిలోనూ కనిపిస్తాయి.

సారాంశంలో, జీవశాస్త్రంలో జన్యుమార్పిడి అనేది ఒక ప్రాథమిక ప్రక్రియ, ఇది జన్యువులోని డిఎన్ఏ విభాగాల కదలికను కలిగి ఉంటుంది. ఇది జన్యు వైవిధ్యం, జన్యు పరిణామం, పరిశోధన మరియు వైద్యంలో ఆచరణాత్మక అనువర్తనాలను కలిగి ఉండటానికి దోహదం చేస్తుంది.


ట్రాన్స్‌పోజిషన్ (జన్యుమార్పిడి) అర్థం చేసుకోవడం కష్టమైన అంశం మరియు దానిని తెలుగులో వివరించడం ఇంకా కష్టం. నేను నా వంతు ప్రయత్నం చేసాను. ఈ అద్భుతమైన సహజ ప్రక్రియ గురించి మీరు తెలుసుకోగలరని ఆశిస్తున్నాను.


సంబంధిత పదాలు

mRNA

ఎం ఆర్ ఎన్ ఏ

mRNA (మెసెంజర్ RNA) ప్రోటీన్ సంశ్లేషణ కోసం DNA నుండి రైబోజోమ్‌లకు జన్యు సమాచారాన్ని తీసుకువెళ్లడానికి బాధ్యత వహిస్తుంది.
Central Dogma

సెంట్రల్ డాగ్మా

జన్యు సమాచార ప్రవాహం యొక్క మూల సూత్రం: DNA నిల్వ చేస్తుంది, RNA మోసుకెళ్తుంది, ప్రోటీన్ పనిచేస్తుంది.
Ecology

జీవావరణ శాస్త్రం

జీవావరణ శాస్త్రం అనేది జీవులు మరియు వాటి పర్యావరణం మధ్య సంబంధాలు మరియు పరస్పర చర్యల యొక్క శాస్త్రీయ అధ్యయనం.
Mitochondria

మైటోకాండ్రియా

మైటోకాండ్రియా యూకారియోటిక్ కణాలలో కనిపించే అవయవాలు. ఇది అడెనోసిన్ ట్రిఫాస్ఫేట్ (ATP) శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
Disease

వ్యాధి

వ్యాధి ఒక అసాధారణ పరిస్థితి, రుగ్మత, ఇన్‌ఫెక్షన్, జన్యుపరమైన లోపం, పర్యావరణ కారకం లేదా వాటి కలయిక వల్ల సంభవిస్తుంది.
Blood Brain Barrier

రక్త-మెదడు కంచె

రక్త-మెదడు కంచె అనేది మన రక్తం మరియు మెదడు నడుమ పదార్థాల బదిలీని నియంత్రించి మెదడును రక్షించే ఒక వ్యవస్థ.
Nucleus

న్యూక్లియస్

న్యూక్లియస్ యూకారియోటిక్ కణాలలో కనిపించే పొర-బంధిత అవయవం. ఇది సెల్యులార్ కార్యకలాపాల నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుంది.
Immunity

రోగనిరోధక శక్తి

రోగనిరోధక శక్తి వ్యాధికారక సూక్ష్మజీవులు, పదార్ధాల ప్రభావాలను నిరోధించడానికి ఒక రక్షిత సామర్థ్యాన్ని సూచిస్తుంది.
Transcription

లిప్యంతరీకరణ

DNA నుండి RNA లోకి జన్యు సమాచారాన్ని లిప్యంతరీకరించే ప్రక్రియ.
Centriole

సెంట్రియోల్

సెంట్రియోల్ జంతు కణాల సైటోప్లాజంలో ఒక చిన్న స్థూపాకార అవయవం, ఇది కణ విభజన మరియు సైటోస్కెలిటన్ సంస్థలో పాల్గొంటుంది.